ఎన్టీఆర్ మూవీలో రమ్యకృష్ణకి ఛాన్స్?
- త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్
- ఆయన జోడీగా పూజా హెగ్డే
- తొలి షెడ్యూల్ చిత్రీకరణ
'అత్తారింటికి దారేది'లో నదియా .. 'అజ్ఞాతవాసి'లో ఖుష్బూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలాగే ఎన్టీఆర్ సినిమాలోనూ స్త్రీ ప్రాధాన్యత కలిగిన ఒక కీలకమైన పాత్ర ఉందట. ఈ పాత్ర కోసం రమ్యకృష్ణను అనుకుంటున్నట్టుగా సమాచారం. ఇటీవలే తమిళంలో సూర్య మూవీలో ఒక ముఖ్యమైన పాత్ర చేసిన రమ్యకృష్ణ, ప్రస్తుతం 'శైలజా రెడ్డి అల్లుడు'లో పవర్ఫుల్ రోల్ చేస్తోంది. త్రివిక్రమ్ సినిమాలో రమ్యకృష్ణ ఎంపిక ఖరారైతే . . కచ్చితంగా అది ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణే అవుతుందని చెప్పొచ్చు.