ఎన్టీఆర్ పాటల రికార్డింగ్ పూర్తిచేస్తోన్న తమన్
- ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ మూవీ
- కథానాయికగా పూజా హెగ్డే
- సంగీత దర్శకుడిగా తమన్
ఈ మధ్య కాలంలో తమన్ 'తొలిప్రేమ' .. 'ఛల్ మోహన్ రంగ' కోసం స్వరపరిచిన పాటలు యూత్ లోకి బాగా దూసుకుపోయాయి. ఇక ఎన్టీఆర్ కి యూత్ లోను .. మాస్ లోను గల ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తమన్ ఈ సినిమాకి స్వరాలను అందిస్తున్నాడట. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, దసరాకి విడుదల చేయనున్నారు.