దుల్కర్ సల్మాన్ కి హిట్ ఇచ్చిన మూవీ రీమేక్ లో అల్లు శిరీశ్
- మలయాళంలో హిట్ కొట్టిన 'ఏబీసీడీ'
- దుల్కర్ కి స్టార్ డమ్ తెచ్చిన మూవీ
- తెలుగు రీమేక్ దర్శకుడిగా సంజీవ్ పరిచయం
ఒక రిచ్ ఎన్నారై .. ఇండియాకి వచ్చి, చాలా సాధారణమైన జీవితాన్ని గడపాలనుకుంటాడు. అప్పుడతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనే కథాంశంతో ఈ సినిమా కొనసాగుతుంది. ఈ రీమేక్ ద్వారా దర్శకుడిగా సంజీవ్ పరిచయం అవుతున్నాడు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టేసి .. ఇదే సంవత్సరంలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.