మహేశ్ బాబు ఫ్రెండ్ గా కామెడీ హీరో ఖరారైపోయాడు
- వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు
- ఆయన కెరియర్లో 25వ సినిమా
- కథానాయికగా పూజా హెగ్డే
ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. మహేశ్ ఫ్రెండ్ పాత్రకి అల్లరి నరేశ్ ను అనుకుంటున్నారనే టాక్ వినిపించింది. ఆయనను తీసుకున్నారనేది తాజా సమాచారం. మహేశ్ తో పాటు సినిమా అంతా కనిపించే పాత్ర ఇది. ఈ పాత్రలోని కొత్తదనం కారణంగానే అల్లరి నరేశ్ అంగీకరించాడని అంటున్నారు. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని చెబుతున్నారు.