పెద్ద దర్శకుల దృష్టిలో పడటానికి మా ఆకాశ్ చాలా ట్రై చేసేవాడు: పూరీ జగన్నాథ్
- పూరీ దర్శకత్వంలో 'మెహబూబా'
- హీరోగా పూరీ తనయుడు ఆకాశ్
- వచ్చేనెల 11వ తేదీన రిలీజ్
"ఒక కథలో తాను హీరోగా అనుకుని మహేశ్ కు ఒక వేషం కేటాయించాడు. తర్వాత ఆ కథను మహేశ్ కి చెప్పమని గొడవ చేసేవాడు. అలా చేస్తే ఇద్దరినీ కలిపి మహేశ్ తన్నేస్తాడని నేను చెప్పడంతో ఆగాడు. 'ఇక ఒక వయసు వచ్చాక .. నాకు వీలైతే నిన్ను హీరోగా చేస్తాను .. ఈ లోగా నీ ప్రయత్నం నువ్ చేసుకో' అని చెప్పాను. అప్పటి నుంచి రాజమౌళి .. వినాయక్ .. సుకుమార్ దృష్టిలో పడటానికి ట్రై చేసేవాడు. వాళ్లు కనిపిస్తే చాలు .. కాళ్లకి దండాలు పెట్టేసేవాడు" అంటూ నవ్వేశాడు.