నివేదా థామస్ .. షాలినీ పాండేతో సెట్స్ పైకి కల్యాణ్ రామ్
- కల్యాణ్ రామ్ తాజా చిత్రంగా 'నా నువ్వే'
- తదుపరి చిత్రానికి సన్నాహాలు
- కథానాయికలుగా నివేదా .. షాలిని పాండే
ప్రముఖ సినిమాటోగ్రఫర్ 'గుహన్' ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్ .. షాలినీ పాండే కథానాయికలుగా నటిస్తారు. తెలుగులో నివేదా థామస్ వరుస విజయాలతో ఉండగా, 'అర్జున్ రెడ్డి' తో విపరీతమైన క్రేజ్ ను షాలిని పాండే సొంతం చేసుకుంది. ఈ కారణంగా ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.