సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సంప్రదాయం ఉంది: రమ్య నంబీశన్
- సినీ రంగంలో అవకాశాలివ్వడంలో సెక్సువల్ ఫేవర్ ఆశిస్తారు
- అలాంటి ఘటనలు నాకు ఎదురుపడలేదు
- మహిళా నటులు దీనిపై ధైర్యంగా పోరాడాలి
పేరు వేరైనా క్యాస్టింగ్ కౌచ్ అన్నది అన్ని రంగాల్లోనూ ఉందని ఆమె అభిప్రాయపడింది. సినీ రంగంలో అవకాశాల పేరుతో సెక్సువల్ ఫేవర్ ఆశిస్తారని చెప్పింది. తనకు అలాంటి ఘటనలు ఎదురుకానప్పటికీ, పలువురు సహనటులు చెప్పగా విన్నానని తెలిపింది. వీటిని అడ్డుకోవాలని, ఇలాంటి సంప్రదాయంపై మహిళా నటులు ధైర్యంగా పోరాడాలని రమ్య నంబీశన్ పిలుపునిచ్చింది.