సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ప్రెగ్నెన్సీ వార్తలను ఖండించిన ఇలియానా
- శర్వానంద్ కోసం హైదరాబాదులో సెట్
- స్పెయిన్ లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న తాప్సీ
* శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం కోసం హైదరాబాదులో ఓ సెట్ వేస్తున్నారు. రెండో షెడ్యూలు షూటింగును త్వరలో ఈ సెట్స్ లో నిర్వహిస్తారు. శర్వ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
* ప్రస్తుతం తెలుగులో ఓ చిత్రాన్ని, హిందీలో మరో చిత్రాన్ని చేస్తున్న సొట్టబుగ్గల చిన్నది తాప్సీ ఇప్పుడు హాలిడే కోసం బ్రేక్ తీసుకుంది. తన చెల్లి శాగున్ తో కలసి స్పెయిన్ లో హాలిడేను ఎంజాయ్ చేస్తోంది.