'భరత్ అనే నేను-2'కావాల్సిందే... కొరటాలను కోరిన థమన్!
- నిన్న విడుదలైన 'భరత్ అనే నేను'
- సినిమా అద్భుతమన్న థమన్
- సీక్వెల్ తీయాలని కోరిక
మంచి కథను అత్యద్భుతంగా తెరకెక్కించారని, సూపర్ స్టార్ మహేష్ ఎప్పుడూ ఇటువంటి సాంఘిక సినిమాలు చేయాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పాడు. సినిమా చూస్తున్నంత సేపూ, మహేష్ నుంచి చూపు తిప్పుకోలేకపోయానని చెప్పిన థమన్, "ఈ సినిమాకు సీక్వెల్ చేయండి సార్" అంటూ దర్శకుడు కొరటాలను కోరాడు. 'భరత్ అనే నేను-2'ను జాతీయ స్థాయిలో తీసేలా ప్రణాళిక రూపొందించాలని కూడా థమన్ కోరాడు.