ఆ కాస్ట్యూమర్ కి నాపై కోపం వచ్చింది .. 'గుర్తుపెట్టుకుంటా' అంటూ బెదిరించాడు: నటుడు హర్షవర్ధన్
- ఆ కాస్ట్యూమర్ నిర్లక్ష్యంగా చెప్పాడు
- పూరీకి చెబితే చీవాట్లు పెట్టాడు
- దాంతో ఆ కాస్ట్యూమర్ అలా అన్నాడు
అదే విషయం పూరికి చెప్పాను .. దాంతో ఆయన 'ఇందాక ఒక ఆర్టిస్ట్ కోసం అనుకున్నాం కదా .. ఆ ఫైజమా ఇచ్చేయ్, అది ఇతనికి సరిపోతుంది' అని ఆ కాస్ట్యూమర్ తో అన్నాడు. ముందుగా ఆ పని చేయకపోవడం గురించి ఆ కాస్ట్యూమర్ కి చీవాట్లు పెట్టాడు. కోపంతోనే కాస్ట్యూమర్ నా డ్రెస్ మార్చాడు. 'ఇంత గొడవ జరుగుతుందని అనుకోలేదు .. ఏమీ అనుకోకన్నా' అన్నాను. ' గుర్తు పెట్టుకుంటా .. గుర్తుపెట్టుకుంటా' అని కోపంతో అన్నాడు. అతనలా అనగానే నాకు కోపం వచ్చేసింది .. 'అన్నా నీకో విషయం తెలుసా .. గుర్తుపెట్టుకోవడానికి నువ్వు అంత కష్టపడాల్సిన అవసరం లేదు .. నేను ఏం చేసినా గుర్తుండిపోయేలా చేస్తా' నంటూ నా దైన స్టైల్లో చెప్పాను అన్నాడు.