'నేల టిక్కెట్టు' రిలీజ్ విషయంలో ఆలస్యం?
- కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ
- ఈ నెలాఖరుకు టాకీ పార్టు పూర్తి
- పెండింగులో రెండు పాటలు
అయితే కథానాయిక మాళవిక కాలు నరం మెలికపడటం వలన, ఆమె ఎక్కువ సేపు నిలబడలేకపోతోందట. ఈ కారణంగానే మిగిలిన రెండు పాటలను చిత్రీకరించడం కష్టంగా మారిందని అంటున్నారు. త్వరలోనే మాళవిక ఈ సమస్య నుంచి బయటపడనుందనీ, ఆ వెంటనే మిగిలిన పాటలను చిత్రీకరించనున్నామని అంటున్నారు. ఈ కారణంగా విడుదల విషయంలో జాప్యం జరిగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.