వెధవలు వేధిస్తే చెప్పుతో కొట్టండి.. ఇండస్ట్రీని మాత్రం చులకన చేసి మాట్లాడకండి!: నాగబాబు
- కొంతమంది వెధవలు వేధిస్తే చెప్పుతో కొట్టండి
- అంతే తప్పా, ఇండస్ట్రీని చులకన చేసి మాట్లాడొద్దు
- ‘మా’లో ఫ్రీ మెంబర్ షిప్ లేదు
- తెలుగువారికే అవకాశాలివ్వాలని నిర్మాతలకు ‘మా’ చెప్పదు
కొంతమంది వెధవలు వేధిస్తే చెప్పుతో కొట్టండి, అంతే తప్పా, ఇండస్ట్రీని చులకన చేసి మాట్లాడొద్దని సూచించారు. మహిళలంటే తమకు ఎంతో గౌరవమని, తన కూతురుని కూడా సినీ పరిశ్రమలోకి తీసుకొచ్చానని అన్నారు. ‘మా’ అసోసియేషన్ లో ఉన్న సభ్యులకు న్యాయం చేయడం తమ బాధ్యతని, ‘మా’లో ఫ్రీ మెంబర్ షిప్ లేదని, తెలుగువారికే అవకాశాలివ్వాలని నిర్మాతలకు ‘మా’ చెప్పదని అన్నారు.