అది డాక్టర్స్ తప్పే .. అందుకే శ్రీహరి చనిపోయాడు: డిస్కో శాంతి
- శ్రీహరి జ్వరంతో హాస్పిటల్లో చేరారు
- మధ్యాహ్నం వరకూ మాతో మాట్లాడారు
- ఆ తరువాత మాట సరిగ్గా రాలేదు
"జ్వరం రావడం వల్లనే ఆయన హాస్పిటల్ కి వెళ్లాడు. హాస్పిటల్లో చేరిన రోజు మధ్యాహ్నం 12:30 గంటల వరకూ ఆయన నాతోనూ .. పిల్లలతోను మాట్లాడుతూనే వున్నారు. అంతలో నాలుక మడత పడినట్టుగా మాటలు ముద్దముద్దగా రావడం మొదలైంది. నేను గట్టిగా పిలవడంతో నర్సులు పరిగెత్తుకు వచ్చారు .. ఆ తరువాత శ్రీహరిని చూస్తే ముక్కులో నుంచి .. చెవుల్లో నుంచి బ్లడ్ వస్తోంది. దాంతో నన్ను అక్కడి నుంచి పంపించి వేశారు. మా బంధువులు హాస్పిటల్ కి వచ్చారు .. శ్రీహరి చనిపోయిన విషయాన్ని ఆ రోజు రాత్రి వరకూ నాకు చెప్పకుండా దాచారు" అంటూ చెప్పుకొచ్చారు.