విడుదలకు ముందే 'భరత్ అనే నేను' రికార్డు!
- 2000 థియేటర్లలో ప్రీమియర్ షోలు
- విదేశాల్లో 1000 థియేటర్లలో ప్రదర్శన
- హిట్ అయితే, వీకెండ్ లో 3 మిలియన్ డాలర్ల కలెక్షన్లు ఖాయం!
యూఎస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేష్ సినిమా ప్రీమియర్ షోలకు టికెట్ల అమ్మకం ప్రారంభమైందని యూనిట్ వెల్లడించింది. మొత్తం 1000 సినిమా హాల్స్ లో చిత్రం విడుదలవుతుందని తెలిపింది. అంటే 'బాహుబలి-2'కు సమానంగా 'భరత్ అనే నేను' విడుదల కానుంది. సినిమాకు హిట్ టాక్ వస్తే, తొలి వీకెండ్ లో 3 మిలియన్ డాలర్ల వరకూ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రీమియర్ షోలతోనే 1.5 మిలియన్ డాలర్ల వరకూ కలెక్షన్ రావచ్చని కూడా భావిస్తున్నారు.
కాగా, ఇండియాలో సైతం 'బుక్ మై షో' వంటి వెబ్ సైట్లలో సినిమా టికెట్ల అమ్మకం ప్రారంభం కాగా, తొలిరోజు టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడవుతున్నాయి.