సుధీర్ వర్మ మూవీని చకచకా కానిచ్చేస్తోన్న శర్వానంద్
- సుధీర్ వర్మతో శర్వానంద్
- కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్
- కాకినాడలో రెండవ షెడ్యూల్
కొన్ని రోజులుగా ఈ సినిమా వైజాగ్ లో షూటింగు జరుపుకుంటోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తూ వస్తున్నారు. ఈ రోజుతో ఈ షెడ్యూల్ షూటింగు ముగిసింది. తరువాత షెడ్యూలను కాకినాడలో ప్లాన్ చేశారు. కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాలో శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా కల్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది.