ప్రభుదేవా అదరగొట్టేశాడంటోన్న 'మెర్క్యురీ' ఆడియన్స్
- అంధుడిగా ప్రభుదేవా
- దెయ్యంగా అద్భుతమైన నటన
- ప్రేక్షకుల నుంచి ప్రశంసలు
తన బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చుకుని, దెయ్యం పాత్రలో ఆయన అదరగొట్టేశాడని చెబుతున్నారు. అసాధారణమైన తన నటనతో ప్రభుదేవా సెకండాఫ్ ను నిలబెట్టేశాడని అంటున్నారు. ఒక వైపున అంధుడిగా .. మరో వైపున దెయ్యంగా ప్రతీకారం తీర్చుకునే పాత్రలో ప్రభుదేవా జీవించాడని అంటున్నారు. భయాన్ని కలిగించే రూపంతో .. బాధను కలిగించే హావభావాలతో నటుడిగా ప్రభుదేవా నూటికి నూరు మార్కులు సంపాదించుకున్నాడని చెబుతున్నారు.