నాగశౌర్య కొత్త నిర్ణయం .. మెహ్రీన్ ప్లేస్ లోకి కల్యాణి ప్రియదర్శన్
- నాగశౌర్య తాజా చిత్రం షూటింగు మొదలు
- సొంత బ్యానర్లో నిర్మాణం
- కథానాయిక విషయంలో మార్పు
నిన్నటి నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ ను తీసుకోనున్నట్టు చూచాయగా తెలియజేయడం జరిగింది. కానీ చివరిలో మెహ్రీన్ కి బదులుగా ఆమె స్థానంలో కల్యాణి ప్రియదర్శన్ ను తీసుకున్నట్టుగా సమాచారం. తన జోడీగా మెహ్రీన్ కంటే కల్యాణి ప్రియదర్శన్ అయితేనే బాగుంటుందని నాగశౌర్య భావించడమే అందుకు కారణమని అంటున్నారు. గ్లామర్ పుష్కలంగా ఉన్నప్పటికీ మెహ్రీన్ కి ఒక ఛాన్స్ చేజారిపోయిందన్న మాట.