ఆర్టిస్ట్ గా చేస్తూనే కూలి పనికి వెళ్లిన సందర్భాలు వున్నాయి: నటుడు అజయ్ ఘోష్
- ఇబ్బందులు పడుతున్నవాళ్లను చూశాను
- నేను కూడా ఎన్నో బాధలు పడ్డాను
- ఏదోఒకటి తేల్చుకోవాలనే వచ్చాను
"ఇక్కడ ఎవరిని కదిలించినా భయంకరమైన సంఘటనలు బయటికి వస్తాయి. అవకాశాలు రాక .. ఆకలికి తట్టుకోలేక నానా అవస్థలు పడుతుంటారు. అట్లా నేను పడిన బాధలు .. అవమానాలు ఎన్నో వున్నాయి .. ఎన్నని చెప్పమంటారు? సీరియల్స్ లో నటిస్తూ వున్నప్పుడు కూడా గ్యాప్ వచ్చేది .. అప్పుడు యూసఫ్ గూడా అడ్డా నుంచి మాదాపూర్ కి కూలి పనికి వెళ్లేవాడిని. ఏదో ఒకటి తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను కాబట్టి .. అవన్నీ నాకు పెద్ద కష్టాలుగా అనిపించలేదు" అని చెప్పుకొచ్చారు.