'నేల టిక్కెట్టు' నిర్మాతతోనే మరో రెండు సినిమాలు చేయనున్న రవితేజ
- ముగింపు దశలో 'నేల టిక్కెట్టు'
- ఆరంభ దశలో 'అమర్ అక్బర్ ఆంటోనీ'
- రామ్ తాళ్లూరితో ఆ తరువాత సినిమాలు
ఈ సినిమా తరువాత 'నేల టిక్కెట్టు' నిర్మాత రామ్ తాళ్లూరి తోనే మరో రెండు సినిమాలు చేయడానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ రెండింటిలో ఒక సినిమాకి బాబీ .. మరో సినిమాకి బీవీఎస్ రవి దర్శకులుగా వ్యవహరించనున్నారని సమాచారం. ఇక రవితేజ అభిమానులు మే నెలలో విడుదల కానున్న 'నేల టిక్కెట్టు' కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.