త్రివిక్రమ్ కథ మాత్రమే ఇచ్చాడు .. మాటలు మా దర్శకుడివే: నితిన్
- జోరు మీదున్న 'ఛల్ మోహన్ రంగ'
- మాటలకి మంచి మార్కులు
- త్రివిక్రమ్ వ్రాశాడనుకుంటోన్న ప్రేక్షకులు
ఇది కృష్ణ చైతన్యకి కాస్త ఇబ్బందిని కలిగించే విషయమే. దాంతో ఆ క్రెడిట్ తమ దర్శకుడిదేనంటూ నితిన్ రంగంలోకి దిగిపోయాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ గారు కథను మాత్రమే అందించారు .. మాటలు వ్రాసింది మా దర్శకుడేనని చెబుతున్నాడు. అలా కృష్ణ చైతన్య క్రెడిట్ ను కాపాడటానికి తనవంతు కృషి చేస్తున్నాడు. కథను త్రివిక్రమ్ రెడీ చేయడం వలన .. ఆయనతో ఎక్కువమార్లు కృష్ణచైతన్య చర్చలు జరపడం వలన, సంభాషణలపై త్రివిక్రమ్ ప్రభావం పడి ఉండొచ్చనే అభిప్రాయాలు ఇండస్ట్రీలో వ్యక్తమవుతున్నాయి.