ప్రత్యేకమైన సెట్లో జోరుగా 'సైరా' షూటింగ్
- షూటింగు దశలో 'సైరా'
- ప్రత్యేకమైన సెట్లో ముఖ్యమైన ఘట్టం
- కథానాయికగా నయనతార
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన తిరుగుబాటులో భాగంగా కర్నూలులోని 'కోయిలకుంట్ల' ట్రెజరీని కొల్లగొట్టాడు. ఆ ట్రెజరీ సెట్ ను అల్యూమినియం ఫ్యాక్టరీలో వేశారు. సినిమాలో అత్యంత కీలకమైన సమయంలో వచ్చే ఈ ఘట్టం నుంచి కథనం పుంజుకుంటుంది. ఆడియన్స్ విజిల్స్ వేసేలా ఈ సీన్ ఉంటుందని అంటున్నారు. చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, అమితాబ్ కీలకమైన పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే.