హీరో జై పుట్టినరోజు .. శుభాకాంక్షలు తెలిపిన అంజలి
- 'జర్నీ' సినిమాతో జై .. అంజలి మధ్య పరిచయం
- ఆ తరువాత అది ప్రేమగా మారిందనే టాక్
- ఆసక్తిని రేకెత్తిస్తూ అంజలి పోస్ట్ చేసిన సెల్ఫీ
గతంలో 'జై' పుట్టినరోజున ఆయన షూటింగులో వుంటే, అక్కడికే అంజలి కేక్ తీసుకెళ్లి ఆయనతో కట్ చేయించింది. ఆమె లొకేషన్ కి వెళ్లి మరీ ఆయన బర్త్ డే ను సెలబ్రేట్ చేయడం గురించి అంతా చెప్పుకున్నారు. ఇక ఈ రోజున 'జై' పుట్టినరోజు కావడంతో .. అంజలి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది. అంతేకాదు 'జై'తో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేసింది. దాంతో ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉందని చర్చించుకోవడం మొదలుపెట్టారు.