చరణ్ తో అత్తా అని పిలిపించుకోవాలా? అని అడిగాను!: అనసూయ
- 'రంగస్థలం' కథ విన్నప్పుడు చరణ్ హీరో అని తెలియదు
- లేడీ ప్రకాష్ రాజ్ లా కావడం నా కోరిక
- 'నటిగా చాలా ఎదిగావ్ అనసూయ' అంటూ భర్త కితాబు
'రంగస్థలం' కథ విన్నప్పుడు ఆ సినిమాలో రామ్ చరణ్ హీరో అనే విషయం తనకు తెలియదని అనసూయ తెలిపారు. ఆ తర్వాత చరణ్ తో అత్తా అని పిలిపించుకోవాలా? అని అడిగానని... కనీసం రంగమ్మా అని అయినా పిలిపించండి అని సుకుమార్ ను రిక్వెస్ట్ చేశానని చెప్పారు. మా ఆయన ఈ సినిమా చూశాక 'అనసూయ నటిగా చాలా ఎదిగావ్' అని అన్నారని... ఆయన నుంచి నాకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్ ఇది అని తెలిపారు.