sekhar kammula: టాలీవుడ్ డైరెక్టర్ పై సంచలన ఆరోపణలు చేసిన హీరోయిన్ శ్రీరెడ్డి !

  • తెలుగు అమ్మాయిలు పక్కలోకి తప్ప ఎందుకూ పనికిరారని అనుకుంటాడు
  • మా ఇంటి కింద గూర్ఖాలా తిరిగేవాడు
  • వీడియో కాల్ కోసం ఏమైనా కోసేసుకుంటాడు

టాలీవుడ్ లో హీరోయిన్లకు ఎదురవుతున్న లైంగిక వేధింపుల గురించి బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ, సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది హీరోయిన్ శ్రీరెడ్డి. తాజాగా ఓ టాలీవుడ్ దర్శకుడిపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. ఫేస్ బుక్ ద్వారా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.

"పెద్ద డైరెక్టర్ అని పొగరు. అబద్ధాలు చెప్పడంలో దిట్ట. తెలుగు అమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకూ పనికిరారని ప్రగాఢ విశ్వాసం. ప్రామిస్ లను బ్రేక్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా. బక్కపీచు సోగ్గాడు. ఊదితే ఎగిరిపోయే ఇతనికి భయం, బలం రెండూ ఎక్కువే. టెక్నికల్ గా దొరక్కుండా టెక్నాలజీని బాగా వాడాడు. మా ఇంటి కింద గూర్ఖాలా తిరిగేవాడు. వీడియో కాల్ కోసం ఏమైనా కోసేసుకుంటాడు పాపం. మగ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు గుంజుతాడని టాక్. వీరెవరో కాదు కొమ్ములు వచ్చిన శేఖరుడు" అంటూ ఆ దర్శకుని అసలు పేరు చెప్పకుండా హింట్స్ ఇస్తూ శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆ దర్శకుడు ఎవరో ఆ హింట్స్ ను బట్టి ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు.  

sekhar kammula
Tollywood
director
sri reddy
srireddy
actres
comments
  • Loading...

More Telugu News