హీరో సుమంత్ కొత్త సినిమా పేరు ‘ఇదం జగత్’
- ‘ఇదం జగత్’ అంటే ‘ఇది ప్రపంచం’ అని సంస్కృతంలో అర్థం
- ఈ వేసవి తర్వాత నా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది
- ఓ ట్వీట్ లో పేర్కొన్న హీరో సుమంత్
కాగా, విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీ విఫ్నేుష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సుమంత్ వైవిధ్యమైన పాత్రలో కనబడనున్నాడని, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందని ఈ చిత్ర నిర్మాతలు తెలిపారు. ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను త్వరలో విడుదల చేయనున్నట్టు చెప్పారు.