కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- హిందూవాదం కర్ణాటకలో పనిచేయదు
- హిందుత్వ పార్టీలు కన్నడ ప్రజలను విడగొట్టలేవు
- ఏ పార్టీ గెలుస్తుందో మీరే చూస్తారు
తాజాగా, ఓ జాతీయ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.... కర్ణాటక వాసులు అందరితో కలిసి జీవిస్తారని, అందరిని ఆదరిస్తారని, సామరస్యంగా ఉంటారని చెప్పారు. ఆ రాష్ట్రంలో బహుళ సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ ఏడాది మే 12న ఒకే దశలో జరుగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు మే15న వెలువడతాయి.