తాజ్ మహల్ సందర్శన సమయంపై పరిమితి విధించిన అధికారులు
- 3 గంటల కంటే ఎక్కువ సమయం అక్కడ ఉండేందుకు వీలు లేదు
- ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న నిర్ణయం
- ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటన
కాగా, తాజ్ మహల్ వద్ద ముఖ్యంగా వారాంతాలు, సెలవు రోజుల్లో సందర్శకుల సంఖ్య అధికంగా ఉంటుంది. సాయంత్రం గేట్లు మూసే వరకు తాజ్ మహల్ ప్రాంగణంలోనే గడుపుతుంటారు. దీంతో, నిరంతరం రద్దీగా వుంటుంది. ఈ విషయమై పర్యావరణ విశ్లేషకులు చేసిన సూచన మేరకు ఏఎస్ఐ కొత్త నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం ప్రకారం, తాజ్ మహల్ సందర్శకులు టికెట్ కొనుగోలు చేసిన సమయం నుంచి మూడు గంటలు మాత్రమే అక్కడి ప్రాంగణంలో ఉండేందుకు అనుమతించనున్నారు. మూడు గంటలకు మించి అక్కడే ఉండాలనుకున్న సందర్శకులు అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.