ఐపీఎల్ ప్రారంభోత్సవంలో అదరగొట్టే సినీ తారలు వీరే!
- ఐపీఎల్ ప్రారంభోత్సవంలో రణ్‌వీర్, వరుణ్ థావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, తమన్నా ఆటాపాటా
- ఏప్రిల్ 7 నుంచి ఐపీఎల్ సమరం షురూ
- ముంబై-చెన్నై జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్
ఈ సారి బాలీవుడ్ స్టార్లు రణ్‌వీర్ సింగ్, వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, తమన్నాతో పాటు పలువురు వేదికపై డాన్సు చేయనున్నారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అలాగే ప్రముఖ గాయకుడు మికా సింగ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో పావు గంట ప్రదర్శన ఇచ్చేందుకు రణ్‌వీర్ సింగ్ రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజంలేదని సదరు అధికారి స్పష్టం చేశారు. వేడుక అనంతరం డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగుతుంది. మే 27న జరిగే ఫైనల్ మ్యాచ్‌కి ఇదే స్టేడియం వేదిక కానున్న సంగతి తెలిసిందే.