సైనికుడి పాత్రలో సిద్ధార్థ్ .. ఈ మూవీపైనే ఆశలు
- మలయాళ మూవీలో సిద్ధార్థ్
- యథార్థ సంఘటనల ఆధారంగా కథ
- ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు
కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. దిలీప్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, సైనికుడిగా సిద్ధార్థ్ కనిపించనున్నాడు. రితీష్ అంబట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటించడం తన అదృష్టమని సిద్ధార్థ్ అంటున్నాడు. ఈ సినిమా కోసం తాను మలయాళం నేర్చుకోవడం కూడా తనకి బాగా కలిసొచ్చే అంశమనీ .. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.