గోపీచంద్ 25 వ మూవీ నుంచి వచ్చేసిన ఫస్టులుక్ అదరగొట్టేస్తోంది
- గోపీచంద్ 25వ మూవీగా 'పంతం'
- ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి
- మే 18వ తేదీన భారీస్థాయిలో విడుదల
ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ద్వారా చక్రి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టులుక్ గోపీచంద్ అభిమానులను ఆకట్టుకునేలా వుంది. ఆవేశం .. ఆవేదనతో కూడిన ఆలోచనలో గోపీచంద్ వున్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మే 18వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.