ఇక ఆగేది లేదు .. త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లేది ఆ రోజునే!
- త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ మూవీ
- ఏప్రిల్ 12వ తేదీన మొదలు
- ఫిల్మ్ సిటీలో ఫస్టు షెడ్యూల్
ఆ రోజు నుంచే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి .. నెలాఖరు వరకూ షూటింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ షెడ్యూల్ ను పూర్తిచేయనున్నారు. ఆ తరువాత నాలుగైదు రోజులు మాత్రమే గ్యాప్ ఇచ్చి, ఆ వెంటనే రెండవ షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నట్టు చెబుతున్నారు. రెండవ షెడ్యూల్ షూటింగును ఎక్కడ ప్లాన్ చేశారనేది తెలియాల్సి వుంది. వీలైనంత వరకూ ఈ సినిమాను దసరాకే విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.