మరోసారి హిందువులు బలిదానం చేయాల్సిన సమయం: బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
- రామ జన్మభూమి కోసం ఉద్యమించాలి
- హిందూ యువకుల త్యాగాలతోనే కోరిక సిద్ధి
- బీజేపీ ఎంపీ వినయ్ కతియార్
కాగా, 1992, డిసెంబర్ 6వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో కరసేవకులు బాబ్రీ మసీదుపై జరిపిన దాడిలో పోలీసుల కాల్పులకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వివిధ ప్రాంతాల్లో జరిగిన మత ఘర్షణల్లో దాదాపు 2 వేల మందికి పైగానే మరణించారు. అప్పటి నుంచి రామజన్మభూమి కేసు సుప్రీంకోర్టులో విచారణ ఉండగా, ప్రస్తుతం తుది విచారణ జరుగుతోంది. ఈ సమయంలో వినయ్ కతియార్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.