తమిళ వెర్షన్ తోనే సరిపెడుతోన్న 'బిచ్చగాడు' హీరో
- తెలుగులో హిట్ కొట్టిన 'బిచ్చగాడు '
- బేతాళుడు' .. 'యముడు'కి లేని ఆదరణ
- ఇక 'కాళి' సినిమాకి బిజినెస్ లేదు
అయితే ఆ తరువాత వచ్చిన 'బేతాళుడు' .. 'యముడు' సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఇక తమిళంలో ఆయన తాజా చిత్రమైన 'కాళి' సినిమాను తెలుగులో కొనేవారే కరువయ్యారు. దాంతో ఆయన తమిళంలో మాత్రమే ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు. తమిళంలో హిట్ కొడితే మాత్రం తెలుగులోకి అనువాదమయ్యే అవకాశాలు వున్నాయి. మరి విజయ్ ఆంటోనికి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.