డిఫరెంట్ కాన్సెప్ట్ తో రవితేజ మూవీ .. దర్శకుడిగా వి.ఐ. ఆనంద్
- వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రవితేజ
- నిర్మాతగా రామ్ తాళ్లూరి
- త్వరలోనే పూర్తి వివరాలు
ఈ సారి ఆయన ఎంచుకున్న హీరో .. రవితేజ. ప్రస్తుతం రవితేజ 'నేల టికెట్' సినిమా చేస్తున్నాడు. అలాగే శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత ఆయన వి.ఐ. ఆనంద్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. రామ్ తాళ్లూరి నిర్మించనున్న ఈ సినిమాకి, టైటిల్ ను గానీ .. కథానాయికను గానీ ఇంకా అనుకోలేదు. త్వరలోనే పూర్తివివరాలను ప్రకటించనున్నారు.