Warangal Urban District: "అమ్మా పరీక్షలు సరిగ్గా రాయలేదు" అని సెల్ఫీ వీడియోలో చెబుతూ ప్రాణాలు తీసుకున్న ఇంటర్ విద్యార్థిని

  • నిన్నటితో ముగిసిన ఇంటర్ పరీక్షలు
  • తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చలేకపోయాను
  • తనను క్షమించాలని చెబుతూ చందన ఆత్మహత్య

నిన్నటితో ముగిసిన ఇంటర్ పరీక్షల్లో చక్కగా రాయలేకపోయానన్న మనస్తాపంతో సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ లో కలకలం రేపింది. నగరానికి చెందిన చందన (17) ఇంటర్ పరీక్షలను పూర్తి చేసింది. నిన్న ఆఖరి పరీక్ష రాసి ఇంటికి వచ్చిన తరువాత, తన గదిలోకి వెళ్లి ఉరేసుకుంది. ఉరేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకుంది. తన తల్లిదండ్రులు తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని నెరవేర్చలేకపోతున్నానని కన్నీరు పెట్టుకుంది. తనను క్షమించాలని కోరింది. చెల్లెలు వర్షితకు బై చెప్పింది. ఆ సమయంలో చందన తల్లిదండ్రులు ఓ శుభకార్యం నిమిత్తం బయటకు వెళ్లారు. వారు తిరిగి వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోగా, ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Warangal Urban District
Chandana
Sucide
Inter Exams
  • Loading...

More Telugu News