సూర్య దూకుడు మాములుగా లేదు .. 38వ చిత్రానికి సన్నాహాలు
- సెల్వ రాఘవన్ తో సూర్య
- తదుపరి సినిమా దర్శకుడిగా కేవీ ఆనంద్
- ఆ తరువాత ప్రాజెక్టు సుధా కొంగరతో
ఇక తన 37వ సినిమాను ఆయన కేవీ ఆనంద్ దర్శకత్వంలో చేయనున్నాడు. అందుకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తన 38వ సినిమాను కూడా లైన్లో పెట్టేశాడని తెలుస్తోంది. తమిళంలో 'ఇరుదు సుట్రు'తో హిట్ కొట్టి .. 'గురు' పేరుతో తెలుగులో రీమేక్ చేసిన సుధా కొంగర, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ సంగీతాన్ని అందించనున్నట్టు సమాచారం. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.