ప్లాప్ సినిమా సీక్వెల్ కి రవితేజ ఒప్పుకుంటాడా?
- సీక్వెల్ దిశగా 'నాడోడిగళ్'
- తమిళంలో హీరో శశికుమార్
- తెలుగులో రవితేజను సంప్రదించే ఆలోచన
తమిళంలో శశికుమార్ హీరోగా చేయనుండగా .. తెలుగులో రవితేజతో చేయాలనే ఆలోచనలో సముద్రఖని వున్నాడట. సీక్వెల్ కథను రవితేజకు వినిపించడానికి ఆయన రెడీ అవుతున్నాడు. తెలుగులో 'శంభో శివ శంభో' పరాజయంపాలు కావడంతో, ఈ సినిమా సీక్వెల్ చేయడానికి రవితేజ అంగీకరించకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే .. తమిళ సినిమానే తెలుగులోకి అనువదించాలని సముద్రఖని నిర్ణయించుకున్నట్టు సమాచారం.