'నేల టికెట్' ఫస్టులుక్ రిలీజ్ డేట్
- రవితేజ హీరోగా 'నేల టికెట్ '
- కథానాయికగా మాళవిక శర్మ
- ఉగాది రోజున ఫస్టులుక్
రామ్ - లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఈ ఫైట్ సీన్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఈ సినిమా ఫస్టులుక్ కోసం రవితేజ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉగాది పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ నెల 18వ తేదీన ఈ సినిమా ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో, మాళవిక శర్మ కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.