రిపోర్టర్ గా కనిపించనున్న నిఖిల్
- తమిళంలో హిట్ కొట్టిన 'కనితన్'
- తెలుగు రీమేక్ లో నిఖిల్
- త్వరలోనే పూర్తి వివరాలు
ఆ వెంటనే నిఖిల్ .. తమిళంలో సక్సెస్ ను సాధించిన 'కనితన్' రీమేక్ లో చేస్తున్నాడు. 'కిరాక్ పార్టీ'లో స్టూడెంట్ లీడర్ గా నటించిన ఆయన, ఈ సినిమాలో రిపోర్టర్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇంతవరకూ ఆయన చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఠాగూర్ మధు నిర్మిస్తోన్న ఈ సినిమాకి , సంతోష్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే హీరోయిన్ తో పాటు మిగతా నటీనటుల పేర్లను వెల్లడించనున్నారు.