'శైలజా రెడ్డి అల్లుడు'లో విభిన్నమైన పాత్రలో దాసరి అరుణ్ కుమార్
- మారుతి దర్శకత్వంలో చైతూ
- టైటిల్ గా 'శైలజా రెడ్డి అల్లుడు'
- కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
చైతూ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు ' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ కి అంకుల్ పాత్రలో దాసరి అరుణ్ కుమార్ కనిపిస్తాడట. ఈ పాత్రను మారుతి వెరైటీగా డిజైన్ చేశాడని అంటున్నారు. ఈ సినిమా తరువాత దాసరి అరుణ్ కుమార్ బిజీ అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషిస్తోంది.