సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
- ప్రియా ప్రకాశ్ పాత్రలో ఎవరో!
- మరో తెలుగు సినిమాలో 'కిరాక్ పార్టీ' నాయిక
- 'తొలిప్రేమ' దర్శకుడితో అఖిల్?
* తాజాగా 'కిరాక్ పార్టీ' చిత్రంలో కథానాయికగా నటించిన సిమ్రన్ పరీన్జా ఆ సినిమా విడుదల కాకుండానే మరో తెలుగు చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. నాగ శౌర్య హీరోగా శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో సిమ్రన్ నాయికగా ఎంపికైంది.
* 'హలో' సినిమా తర్వాత అఖిల్ అక్కినేని నటించే సినిమా ఏమిటన్న విషయంలో ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఈ విషయంలో రకరకాల దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ ఏదీ ఫైనల్ కాలేదు. ఈ క్రమంలో ఇటీవల 'తొలిప్రేమ' సినిమాతో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నట్టు తాజాగా వార్తలొస్తున్నాయి.