శ్రీను వైట్ల మూవీలో రవితేజ తనయుడు .. లయ కూతురు!
- శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని'
- రవితేజ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్
- అమెరికాలో ఎక్కువ భాగం షూటింగ్
ఈ సినిమాలో ఒక కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ ను ఎంపిక చేసుకున్నారు. కథ ప్రకారం ఈ సినిమా 80 శాతం షూటింగును అమెరికాలోని వివిధ నగరాల్లో జరుపుకోనుంది. ఈ సినిమాలో రవితేజ తనయుడు 'మహాధన్' .. సీనియర్ హీరోయిన్ 'లయ' కూతురు 'శ్లోక' చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, సునీల్ ఒక కీలకమైన పాత్రను చేస్తుండటం విశేషం.