రవితేజకు జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్
- రంగంలోకి దిగిన శ్రీను వైట్ల
- టైటిల్ గా 'అమర్ అక్బర్ ఆంటోని'
- కీలకమైన పాత్రలో సునీల్
రవితేజ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ ను సంప్రదించడం .. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయింది. ఇప్పటికే 'నా పేరు సూర్య' .. 'శైలజా రెడ్డి అల్లుడు' వంటి మంచి ప్రాజెక్టులు చేస్తోన్న అనూ ఇమ్మాన్యుయేల్ కి, ఈ సినిమా మరింత హెల్ప్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సునీల్ కీలకమైన పాత్రను పోషించనున్న ఈ సినిమా .. యూఎస్ లో ఎక్కువభాగం షూటింగ్ జరుపుకోనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించనున్నాడు.