ఎన్‌టీఆర్ బయోపిక్‌లో శర్వానంద్...?
- టీనేజ్ ఎన్‌టీఆర్ పాత్రకు పరిశీలనలో శర్వానంద్ పేరు..!
- ఈ పాత్రకు ఏ ఒక్కరినీ ఎంపిక చేయలేదని సమాచారం
- బాలకృష్ణ సొంత బ్యానర్‌లో తెరకెక్కనున్న 'ఎన్‌టీఆర్' చిత్రం
స్కూలు విద్యార్థిగా, టీనేజర్‌గా, 25 ఏళ్ల యువకుడిగా ఎన్‌టీఆర్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించనున్నారు. 25 ఏళ్ల వయసు దాటినప్పటి ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషిస్తారు. అయితే ఇందులో టీనేజ్ ఎన్‌టీఆర్ పాత్ర కోసం టాలీవుడ్‌లోని పలువురు యువ హీరోల పేర్లను పరిశీలిస్తున్నామని, వారిలో శర్వానంద్ కూడా ఒకరని, కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరినీ ఈ పాత్ర కోసం ఫైనలైజ్ చేయలేదని ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుతో సంబంధమున్న వారు చెబుతున్నారు. విలక్షణమైన చిత్రాలతో దూసుకుపోతోన్న శర్వానంద్‌కే ఈ పాత్ర దక్కవచ్చని పలువురు భావిస్తున్నారు.