ఆ సీన్ చూసి మా నాన్న చాలా కంగారుపడిపోయారు: అల్లరి నరేశ్
- ఆ ఫైట్ లో నా చెవికి దెబ్బ తగిలింది
- అప్పుడు ఇంట్లో చెప్పలేదు
- కానీ ఆ తరువాత మా నాన్నకి తెలిసిపోయింది
షూటింగ్ అయిన తరువాత ఐస్ పెట్టుకున్నాను .. ఇంట్లో ఎవరికీ ఈ విషయం తెలియకుండా చూసుకున్నాను. కొంతకాలం తరువాత టీవీలో ఆ సీన్ వస్తుండగా మా నాన్న చూశారు. వెంటనే నాకు ఫోన్ చేసి పిలిపించారు. 'ఆ షాట్ లో దెబ్బ బాగా తగిలినట్టుగా నాకు అనిపిస్తోంది .. నిజం చెప్పు చెవికి ఏమైనా ఇబ్బంది అయిందా? .. డాక్టర్ దగ్గరికి వెళ్లి ఒకసారి చెక్ చేయిద్దామా'? అంటూ కంగారును వ్యక్తం చేశారు. అలాంటిదేంలేదంటూ నేను కూల్ చేశాను" అంటూ చెప్పుకొచ్చాడు.