సామాన్యుడికి త్వరలో 'మహారాజ' యోగం... సగానికి సగం తగ్గనున్న లగ్జరీ రైళ్ల టికెట్ల ధరలు!
- లగ్జరీ రైళ్ల ఛార్జీలను సగానికి సగం తగ్గించనున్న రైల్వే శాఖ...!
- ఈ రైళ్లపై విదేశీ ప్రయాణికులకు తగ్గిన మోజు
- రాష్ట్ర పర్యాటక శాఖలు, ఐఆర్‌సీటీసీలపై తగ్గింపు భారం..!
'ది పయనీర్' నివేదిక ప్రకారం, తగ్గించిన ఈ ఛార్జీల వల్ల వచ్చే నష్టాలను రాష్ట్ర పర్యాటక శాఖలు, ఐఆర్‌సీటీసీ లాంటి భాగస్వాములు భరించాల్సి ఉంటుంది. ఈ లగ్జరీ రైళ్లపై విదేశీ ప్రయాణికుల ఆసక్తి గణనీయమైన రీతిలో తగ్గిపోవడం కూడా ఛార్జీల తగ్గింపు నిర్ణయానికి ఓ కారణం. ప్యాలెస్ ఆన్ వీల్స్, రాయల్ రాజస్థాన్ లగ్జరీ రైళ్ల రెవెన్యూ వరుసగా 24 శాతం, 63 శాతానికి పైగా పడిపోయింది. ఈ రెండు రైళ్లను భారత రైల్వే శాఖే నడిపిస్తోంది. ఈ నెల 1న జరిగిన రైల్వే బోర్డు సమీక్షా సమావేశంలో ఛార్జీల తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఓ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.