విజయ్ దేవరకొండ ట్వీట్ లో అసలు అర్థమది!
- ‘నాకు కూడా బ్యాక్ లాగ్స్ ఉన్నాయబ్బా..’ అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్
- ఆ బ్యాక్ లాగ్స్ చదువుకు సంబంధించి కాదు
- విజయ్ దేవరకొండ నటించిన ‘ఏ మంత్రం వేసావె’ సినిమా గురించి
ఎందుకంటే, విజయ్ దేవరకొండ ప్రస్తావించింది 2014లో ప్రారంభమైన తన సినిమా ‘ఏ మంత్రం వేసావె’ గురించి. కొన్ని కారణాల వల్ల ఈ చిత్ర నిర్మాణం, విడుదల వాయిదా పడుతూ వచ్చింది. నిన్న విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, ‘యూ ట్యూబ్’ ట్రెండింగ్ లో నాల్గో స్థానంలో ఉంది. అందుకే, ‘ఐదేళ్ల తర్వాత ‘యూ ట్యూబ్’లో ట్రెండ్ అవుతోంది’ అని తన ట్వీట్ లో సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా, శ్రీధర్ మర్రి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన శివానీ సింగ్ నటిస్తోంది.