టీడీపీ నేతల సవాల్ ని స్వీకరిస్తున్నా..చర్చకు సిద్ధంగా ఉన్నా!: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి
- వైఎస్ హయాంలో పులివెందులలో అభివృద్ధి జరిగింది
- చేసిన అభివృద్ధి గురించి చెప్పే దమ్ము మాకు ఉంది
- చర్చకు రండి.. టీడీపీ నేతలకు ఇదే నా ప్రతి సవాల్ : అవినాష్ రెడ్డి
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తున్న టీడీపీ ప్రభుత్వం ఈవిధంగా సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో ఎనభై శాతం పనులను వైఎస్సారే పూర్తి చేశారని, మిగిలిన ఇరవై శాతం పనులను కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోతున్నారని విమర్శించారు. వైఎస్సార్ పూర్తి చేసిన పనులకు టీడీపీ సర్కార్ గేట్లు ఎత్తి ఆ అభివృద్ధి అంతా తమదని చెప్పుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.