త్రివిక్రమ్ .. నాని సినిమాకి నిర్మాతగా డీవీవీ దానయ్య
- నాని హీరోగా త్రివిక్రమ్ మూవీ
- ఎన్టీఆర్ సినిమా పూర్తికాగానే సెట్స్ పైకి
- నిర్మాతగా డీవీవీ దానయ్య
ఆయనతో ఒక సినిమా చేసిపెట్టమని త్రివిక్రమ్ ను డీవీవీ దానయ్య ఒత్తిడి చేస్తున్నారట. ఆ విధంగా చేయడానికి త్రివిక్రమ్ కూడా సుముఖంగానే వున్నాడని అంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ఏర్పాట్లలో వున్నాడు. ఆ తరువాత ఆయన మహేశ్ బాబు .. వెంకటేశ్ లతో సినిమాలు చేయనున్నాడు. అయితే డీవీవీ దానయ్య కోరిక మేరకు ఎన్టీఆర్ సినిమాను పూర్తి చేసిన వెంటనే, నానితో కలసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ .. నాని కాంబినేషన్ పట్ల అందరిలోను ఆసక్తి నెలకొంది.