అందుకే నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట!
- మైత్రీ మూవీ మేకర్స్ తో నాని
- దర్శకుడిగా సంతోష్ శ్రీనివాస్
- పవన్ కోసం అనుకున్న కథేనా అనేది సందేహం
ఈ ప్రాజెక్టు చేయడానికి నాని అంగీకరించాడనేది తాజా సమాచారం. సంతోష్ శ్రీనివాస్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమా 'కందిరీగ' మాత్రమే. ఆ తరువాత ఆయన చేసిన 'రభస' .. 'హైపర్' సినిమాలు పరాజయం పాలయ్యాయి. అయినా ఆయనతో సినిమా చేయడానికి నాని అంగీకరించడానికి కారణం బ్యానర్ కి గల వాల్యూ అని అంటున్నారు. కథా కథనాలపై వాళ్లు పెట్టే ప్రత్యేక శ్రద్ధపై గల నమ్మకంతోనే నాని ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పేశాడని అంటున్నారు. అయితే ఇది పవన్ కోసం అనుకున్న కథేనా? కాదా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.